జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుండి ఈనెల 28న పిఎస్‌ఎల్‌వి-సి33 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహుర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రీ కౌంట్‌డౌన్, రిహార్సల్స్ సోమవారం శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ ముందుకు తీసుకొచ్చి మళ్లీ వెనక్కి పంపే ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను మంగళవారం ఉదయం 9.20 గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్ యాభై ఒకటిన్నర గంటలు నిర్విగ్నంగా కొనసాగిన అనంతరం ఈనెల 28న శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రాకెట్ నింగిలోకి ఎగరనున్నది. ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి దూసుకెళ్లేందుకు మొదటి దశలో ఆరు ఎక్స్‌ఎల్ స్ట్రాపాన్ బూస్టర్ మోటార్లను వినియోగించనున్నారు. నాలుగు దశల్లో జరిగే ప్రయోగం రాకెట్ భూమి నుండి ఎగిరి నాలుగు దశలు పూర్తి చేసుకున్న అనంతరం 284 కిలోమీటర్ల దూరంలో భూమికి ఏటవాలుగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగంతో ఇస్రో అన్ని సెంటర్ల డైరెక్టర్లు ఇప్పటికే షార్‌కు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం షార్‌కు చేరుకోనున్నారు. షార్‌కు చేరుకున్న అనంతరం ప్రయోగ దశకు సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను పరిశీలించి శాస్తవ్రేత్తలతో సమావేశం కానున్నారు. ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.

చిత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి సి33 రాకెట్