జాతీయ వార్తలు

రాముడు పుట్టినచోటే మందిరం నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: రాముడు పుట్టినచోటే గుడి కట్టాలని బిజెపి సీనియర్ నేత ఎం సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. సరయు నదికి ఆవలవైపున మసీదు నిర్మిస్తే అయోధ్య వివాదం సమసిపోతుందని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. ‘రామ మందిరం, మసీదు నిర్మించాలన్నదే మా కోరిక. మొదటినుంచీ మేం దీనికి అనుకూలమే. రాముడు పుట్టినచోట మందిరం, సరయు నదికి పక్కన మసీదు నిర్మించాలి’ అని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. కోర్టు వెలుపల ఉభయులు కూర్చుని అయోధ్య వివాదం పరిష్కరించుకోవాలని సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య వివాదానికి పరిష్కారం చూపాలంటూ స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాలు కూర్చుని సంప్రదింపులద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్ సారథ్యంలోని ధర్మాసనం సూచించింది. పరిష్కారం దొరకని పక్షంలో తాము జోక్యం చేసుకుంటామని అన్నారు. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ‘మసీదును సరయు నది ఆవలవైపున, రామమందిరం రాముడు జన్మించినచోట కట్టాలన్నదే నా అభిప్రాయం. అలా జరిగితే ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు.