జాతీయ వార్తలు

ఎన్‌ఎస్‌ఇబిసికి ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కోట్లాది మంది కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్థాయి గల జాతీయ కమిషన్ (ఎన్.ఎస్.ఈ.బి.సి)ఏర్పాటును ఆమోదించింది. మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఎస్‌ఈబిసి ఏర్పాటుకు సంబంధించిన బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రతిపాదిస్తారు. తాజా జాతీయ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ (నేషనల్ బి.సి కమీషన్- ఎన్.బి.సి)ని ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌బిసి స్థానంలో రాజ్యాంగ ప్రతిపత్తితో కొత్త కమిషన్ ఏర్పాటవుతుంది.
కొత్త కమిషన్‌లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఇచ్చిన విధంగా బిసి కమిషన్‌కు కూడా రాజ్యాంగ స్థాయి కల్పించాలని వెనకుబడిన కులాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఎన్నో సంవత్సరాలగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బిసి ఎంపీలు మూడు రోజుల క్రితం ప్రధానిని కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు.బిసి కమిషన్‌కు రాజ్యాంగపరమైన స్థాయి కల్పించటంతోపాటు దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారి అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కూడా వారు మోదీని కోరారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర బిసీలందరూ బిజెపికి ఓటు వేయటం తెలిసిందే. యాదవేతర బీసీల మద్దతు లభించినందుకే భారతీయ జనతా పార్టీ కూటమికి 325 సీట్లు దక్కాయి. ఉత్తర ప్రదేశ్‌లో యాదేవేతర బీసీల మద్దతు సంపాదించినట్లే ఇతర రాష్ట్రాలలోని వెనకబడిన కులాల ప్రజల మద్దతు సంపాదించాలన్నది నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆలోచన. అందుకే వారు రాజ్యాంగ స్థాయితో కూడిన బి.సి కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సామాజికంగా,విద్యాపరంగా వెనుకబడని వర్గాల పేరుతో కమిషన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు చెందిన వారందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.