జాతీయ వార్తలు

రామమందిర నిర్మాణానికి ముస్లింలు మద్దతు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంషెడ్పూర్, మార్చి 23: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణాన్ని సమర్థించాలని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గురువారం ముస్లింలను కోరారు. ‘్భరత పురాతత్వ పరిశోధనా సంస్థ సర్వే తర్వాత వివాదాస్పద స్థలంలో ఆలయ కట్టడం బైటపడిన స్థలంలో మాత్రమే రామమందిరాన్ని నిర్మించగల’మని 1931లో ఇదేరోజు ఉరితీసిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళి అర్పించడం కోసం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ స్వామి చెప్పారు. వివాదాస్పద స్థలంలో ఆలయ కట్టడం బైటపడినట్లు అలహాబాద్ హైకోర్టు 2003లోనే స్పష్టం చేసినట్లు ఆయన అన్నారు. మందిరాన్ని కూల్చివేసిన తర్వాత బాబ్రీ మసీదును నిర్మించడం జరిగిందని, అందువల్ల హిందువులు చాలాకాలంగా మందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తున్నారని స్వామి చెప్పారు. ‘సామరస్యంగా సమస్య పరిష్కారమైతే సరేసరి, లేనిపక్షంలో 2018 ఏప్రిల్ నాటికి రాజ్యసభలో మాకు మెజారిటీ లభించినప్పుడు అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణంకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంలో మందిర నిర్మాణానికి సామరస్య పూర్వక పరిష్కారానికి ముస్లింలు ముందుకు వస్తే సంతోషిస్తాం. లేనిపక్షంలో షాబానో కేసులో గత రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందో మేము కూడా అదేబాటలో నడుస్తాం’ అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ‘మథుర, కాశి, అయోధ్య ఈ మూడు స్థలాలనుంచి ఖాళీ చేయమని మాత్రమే మేము ముస్లింలను కోరుతున్నాం’ అని ఆయన అంటూ, 2024 నాటికల్లా ఈ మూడు స్థలాలు స్వేచ్ఛను పొందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ వివాదంతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతోను చర్చించాలని సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామిని కోరిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయమై తాను మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒవైసీ, బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీలతో చర్చించినట్లు స్వామి చెప్పారు. ముస్లిం నాయకులు ద్వైపాక్షిక చర్చలకు అంగీకరించడం లేదని, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నారని ఆయన చెప్పారు.