జాతీయ వార్తలు

కృషికి గుర్తింపు ఈ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ అవార్డులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పా రు. ఆయన గురువారం ఢిల్లీలో సి.ఎన్.బి.సి-టి.వి 18 ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు లభించిన స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి తాము ఎంతోకష్టపడుతున్నాం, ప్రజలకు సుపరిపాలనను అందజేస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. మీడియా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి అవార్డులు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ అవార్డుల మూలంగా తమపై బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని దేశం, ప్రజలు గుర్తిస్తున్నా, ప్రతిపక్షం మాత్రం దీనిని గుర్తించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించేందుకు కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాము విజన్ 2020, విజన్ 2029, విజన్ 2050లతో ముందుకు సాగుతున్నామన్నారు. 2020కి నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్ రాష్ట్రంగా నిలుపుతామని ఆయన మరోసారి ప్రకటించారు. దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తన వంతు కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును అందుకోవటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. అందరం ఒక బృందంగా ఏర్పడి రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. టీం వర్క్‌కు ఈ అవార్డు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.

చిత్రం..కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సిఎం చంద్రబాబునాయుడు