జాతీయ వార్తలు

బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా పట్ల దత్తాత్రేయ హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: జాతీయ ఆర్థిక, సామాజిక, వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళ కమిషన్ మాదిరిగానే జాతీయ ఆర్థిక, సామాజిక, వెనకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ బద్ధమైన హోదా కల్పించబడిందని ఆయన వెల్లడించారు. ఈ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందన్నారు. బీసీల అభివృద్ధికి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం కీలక పరిణామంగా ఆయన తెలిపారు. బీసీ కమిషన్ స్థానంలో నూతన కమిషన్ ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు.
నా పోరాటం ఫలించింది: విహెచ్
జాతీయ ఆర్థిక, సామాజిక, వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడ పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతురావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఎంతోకాలంగా బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నానని, ఇన్నాళ్లకు నా పోరాటం ఫలించిందని వెల్లడించారు. ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.