జాతీయ వార్తలు

బంజారాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: బంజారా వర్గానికి చెందిన ప్రజలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టిఆర్‌ఎస్ సభ్యుడు భీంరాం బి.పాటిల్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బంజారా, లంబాడా, మథురా కులాలను బి.సి జాబితా నుండి తొలగించి ఎస్.టి జాబితాలో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. బంజారాల వినూత్న సాంస్కృతి, సభ్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్య లు తీసుకోవాలన్నారు. తెలంగాణాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న నిర్వహించే సద్గురు సేవల మహారాజ్ జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహించటంతోపాటు ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని పాటిల్ డిమాండ్ చేశారు. బంజారాల తాగుడు మాన్పించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజప్తి చేశారు.