జాతీయ వార్తలు

ఎలాంటి సవాళ్లయనా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: సరిహద్దుల్లో ఎలాంటి యుద్ధ తంత్రానికైనా సైనిక దళాలు సన్నద్ధంగా ఉండాలని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. సాంప్రదాయక యుద్ధ తంత్రంతోపాటు ఆధునిక టెక్నాలజీలో సైనిక దళాలు ఆరితేరాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే సత్వర ప్రాతిపదికన ఇందుకు సంబంధించిన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సైనిక దళాల ఆధునీకరణకు అవసరమైన పరిమాణంలో ఆయుధాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తీవ్రస్థాయి జాప్యానికి ఎలాంటి ఆస్కారం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయుధాల దిగుమతికి ఒప్పందాలు కుదిరినా, అవి భారత అవసరాలకు తీరతాయా లేదా అన్న పరీక్షలు దీర్ఘకాలం సాగడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. అలాంటి జాప్యానికి తావుండకూడదని, ఆధునిక సైనిక వ్యవస్థలను తక్షణ ప్రాతిపదికన సమకూర్చుకోవాలని తెలిపారు.