జాతీయ వార్తలు

ఆదిత్యపై ఒత్తిడి తేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఉత్తరప్రదేశ్‌లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోకూడదని, తమకు అనుకూల నిర్ణయాల కోసం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని సంప్రదించకూడదని, రాష్ట్రంలో సుపరిపాలనపైనే యోగి పాలనాయంత్రాంగం దృష్టి సారించేందుకు వీలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలకు సూచించారు. గురువారం ఇక్కడ యుపికి చెందిన పార్టీ ఎంపీలతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో ప్రధాని ఈ సూచనలు చేశారు. రాష్ట్రంలో బిజెపి ఘన విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేసిన పార్టీ ఎంపీలందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పరివర్తన కోసం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ఆయన ఎంపీలకు ఉద్బోధించారు. ‘రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక జట్టుగా పని చేయవలసిన అవసరం గురించి మోదీజీ చెప్పారు. తాము గట్టిగా పనిచేయడానికే ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆనందంగా గడపడానికి కాదని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు’ అని ఈ సమావేశంలో పాల్గొన్న ఒక ఎంపి తెలిపా రు. అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయంలో సిఎంను కాని మరెవరినైనా కాని సంప్రదించకుండా తాము సంయమనం పాటించాలని ప్రధాని స్పష్టం గా చెప్పారని మరో ఎంపి తెలిపారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించాలని పార్టీ కోరుకుంటోందని ప్రధాని తెలిపారని ఆయన చెప్పారు. మోదీ తన నివాసంలో ఎంపీలకు ఇచ్చిన ఈ అల్పాహార విందు సమావేశంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిఅనంత్ కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి తదితరులు పాల్గొన్నారు. యుపిలో బిజెపి ఘన విజయంతో ఉల్లాసంగా గడపకుండా రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠం చేయడానికి కృషి చేయాలని ప్రధాని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు సమగ్రాభివృద్ధి కనిపించాలని ప్రధాని పిలుపునిచ్చినట్టు సమావేశానంతరం విడుదల చేసిన ప్రకటనలో బిజెపి తెలియజేసింది.