జాతీయ వార్తలు

కరవు పీడిత ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కరవు పీడిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతాధికారాల కమిటీ సమావేశంలో తెలంగాణ, ఏపితోపాటు మొత్తం పది రాష్ట్రాలకు కేంద్ర సహ యం అందజేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌కు 584.21 కోట్లు, 314.22 కోట్లు తెలంగాణకు అందజేయనున్నారు. అస్సాంకు 269.40 కోట్లు, బిహార్‌కు 822. 96 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు 152.28 కోట్లు, కర్నాటకకు 171.69, మణిపూర్‌కు 19.11 కోట్లు, రాజస్థాన్‌కు 370.27 కోట్లు, తమిళనాడుకు 2014.45 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు 303.05 కోట్ల కేంద్ర సహాయం ప్రకటించారు. అంతర్‌మంత్రిత్వ శాఖ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ కేటాయింపు లు చేశారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుండి 4,979.97 కోట్లు, జాతీయ గ్రామీణ మంచినీటి కార్యక్రమం నిధుల నుండి 40.67, మొత్తం 5020.64 కోట్లను పది రాష్ట్రాలకు అందజేస్తారు. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్శీతోపాటు నీతి ఆయోగ్, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖసీనియర్ అధికారులు హాజరయ్యారు.

చిత్రం..ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్