జాతీయ వార్తలు

బాబ్రీ మసీదు కేసు విచారణ వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి పలువురు బిజెపి నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో విచారణను సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన అందరినీ ఏప్రిల్ 6 నాటికి రాతపూర్వక నివేదికలు ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తులు పిసి ఘోష్, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన బెంచ్ ఆ మరుసటి రోజు(ఏప్రిల్ 7న) విచారణ చేపడతామని ప్రకటించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ తదితరులు తమపై మోపిన కుట్ర ఆరోపణలపై తిరిగి విచారణను ఎదుర్కోవలసి ఉంటుందా లేదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. కేవలం సాంకేతిక కారణాలతో వీరిపై కుట్ర ఆరోపణలను కొట్టివేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇంతకు ముందు వ్యాఖ్యానించడం తెలిసిందే.
కాగా, విచారణ ప్రారంభంలో ఇప్పటికే సగం విచారణ జరిపిన మరో కేసుకు సంబంధించి మరో బెంచ్ ముందు హాజరు కావడానికి బిజెపి తరఫు అడ్వకేట్ అయిన సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టు అనుమతి కోరారు. అందుకు అంగీకరించిన బెంచ్ తదుపరి విచారణ తేదీకి ముందే కక్షిదారులందరు కూడా తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని స్పష్టం చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అద్వానీ సహా 13 మందిపై కుట్ర ఆరోపణలను రాయబరేలి ప్రత్యేక కోర్టు రద్దు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు సైతం సమర్థించింది. దీనితో సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అహ్మద్ అనే వ్యక్తి కూడా ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.