జాతీయ వార్తలు

తప్పుడు ప్రకటనలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఆయుర్వేద మందులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చెక్‌పెట్టడానికి కేంద్ర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అడ్వర్‌టైజింగ్ స్టాండింగ్ కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రకటించింది. ప్రజలకు నాణ్యమైన, పూర్తి సురక్షితమైన ఆయుర్వేద మందులను ప్రోత్సహిస్తామని కేంద్ర ఆయుర్వేద, యోగ, నెచురోపతి శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వెల్లడించారు. తప్పుదోవపట్టించే పట్టించే అడ్వర్‌టైజ్‌మెంట్లను నిరోధించాలన్న ఉద్దేశంతో ఆయుష్ మంత్రిత్వశాఖ అడ్వర్‌టైజింగ్ స్టాండింగ్ కౌన్సిల్(ఎఎస్‌సిఐ)తో ఎంఓయుపై సంతకం చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఆయుర్వేదంపై వస్తున్న ప్రకటనలపై నిఘా ఉంచి తప్పుడు ప్రకటనలై కొరడా ఝుళిపిస్తామని ఆయన చెప్పారు. నాణ్యమైన, సురక్షితమైన ఆయుర్వేద మందులు ఉత్పత్తికి ఆయుష్ మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఫార్మసీలు, మందుల పరీక్ష లేబొరెటరీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయుష్ మిషన్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు. వౌలిక సదుపాయాలు, ఉత్పత్తి సామర్ధ్యం పెంపు, పరీక్షల కోసం ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. 46 రాష్ట్ర ఫార్మసీలు, 27 డ్రగ్ టెస్టింగ్ లెబొరెటరీలు, 30 లైసెన్సింగ్ అథారిటీలకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, హోమియోపతి మందుల్లో నాణ్యత పెంపునకు కృషి చేస్తున్నామని శ్రీపాద్ నాయక్ అన్నారు.