జాతీయ వార్తలు

అధిక ధరలకు మంచినీటి అమ్మకాలపై 5,700 ఫిర్యాదులు: పాశ్వాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: సీసాల్లో నింపిన తాగునీటితో పాటు ఇతర వస్తువులను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే ఎక్కువ ధరకు అమ్ముతుండటంపై దాదాపు 5,700 ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయమై రాష్ట్రాలకు రాసిన లేఖలకు ఎటువంటి సమాధానం రాలేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఇటువంటి అక్రమాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు త్వరలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని శుక్రవారం ఆయన రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును తొలుత మంత్రివర్గ పరిశీలనకు పంపి, ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. ఏ వస్తువునైనా ఎంఆర్‌పి కంటే అధిక ధరకు అమ్మడం ప్రజలను మోసగించడమే అవుతుందని పాశ్వాన్ పేర్కొంటూ, ఈ అంశంపై ఇటీవల అధికారుతో సమావేశాన్ని నిర్వహించి ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిందిగా సూచించానన్నారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై ఫిర్యాదు వచ్చిందని, అయితే బిసిసిఐ సకాలంలో చర్యలు చేపట్టి వాటిని నిరోధించిందని పాశ్వాన్ చెప్పారు. దీంతో పది రూపాయల విలువచేసే వాటర్ బాటిల్‌ను విమానయాన సంస్థలు 50 రూపాయలకు అమ్ముతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా పేర్కొంటూ, పౌర విమానయాన శాఖను వివాదంలోకి లాగారు. ఇటువంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు ఏవైనా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అని శుక్లా ప్రశ్నించగా, ఇందుకు సంబంధించి గతంలో పంపిన ముసాయిదా బిల్లుకు పార్లమెంటరీ స్థారుూ సంఘం 80కి పైగా సవరణలను సూచించిందని, దీంతో ఈ సవరణలను చేయడం కంటే కొత్త బిల్లును రూపొందించడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించిందని పాశ్వాన్ వివరించారు.