జాతీయ వార్తలు

ఇవిఎంల టాంపరింగ్ ఆరోపణపై ఇసికి సుప్రీంకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఇవిఎం) తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సాఫ్ట్‌వేర్ నిపుణులచే దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలయిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ సమాధానాన్ని కోరింది. ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగించిన ఇవిఎంలను సులభంగా టాంపరింగ్ చేయవచ్చని ఆరోపిస్తున్న ఆ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎస్‌కె కౌల్‌తో కూడిన ధర్మాసనం ఇసికి నోటీసులు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీ స్వార్థ ప్రయోజనం కోసం ఇవిఎంల టాంపరింగ్‌పై దర్యాప్తు చేయడం కోసం ఒక ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టర్ చేసి, దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని వ్యక్తిగత హోదాలో అడ్వకేట్ ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఆ పిల్ కోరింది. అయితే కోర్టు కేంద్రానికి గానీ, పిల్‌లో పేర్కొన్న ఇతరులకు కానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవిఎంల టాంపరింగ్‌పై వచ్చిన ఆరోపణలను ఆ పిల్‌లో ప్రస్తావించారు.