జాతీయ వార్తలు

అజ్మీర్ దర్గాకు ప్రధాని మోదీ ఛాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రసిద్ధి అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ హిద్దీన్ చిష్తికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాదర్ పంపించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, పిఎంఓలో సహాయ మంత్రి జితేంద్రసింగ్ దాన్ని అలంకరించారు. ఈనెల 30 నుంచి చిష్తిలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు అందజేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొయినుద్దీన్ మద్దతుదారులకు ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మిక భారతావనిలో ఖ్వాజా పాత్రను మరువలేమని మోదీ స్పష్టం చేశారు. ఆరోశతాబ్దానికి చెందిన ఖ్వాజా చిష్తి సుఫీల ప్రవక్తగా గణతికెక్కారు. ఆయనను ‘గరీబ్ నవాజ్’(పేదల పెన్నిధి)గా కొలుస్తుంటారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారని పిఎంఓ ప్రకటనలో పేర్కొంది.