జాతీయ వార్తలు

ఆధార్‌తో పాన్‌కు లింకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఆధార్‌ను అన్ని రకాల సేవలకు అనుసంధానం చేస్తున్న కేంద్రం ఇప్పుడు పాన్‌కార్డుతోనూ దీనికి ముడిపెట్టింది. డిసెంబర్ 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని, లేనిపక్షంలో పాన్ చెల్లదని స్పష్టం చేసింది. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలుకు పాన్‌ను ముడిపెట్టిన కేంద్రం ఇప్పుడు దానికి గడువునూ విధించడం గమనార్హం. తాత్కాలికంగా ఈ గడువును డిసెంబర్ 31గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే పాన్ కార్డు ఉన్న వ్యక్తులు దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి లేదా ఆధార్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆధారాలు చూపించాలని అధికార వర్గాల్ని ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఇకనుంచి పాన్, ఓటర్ గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డే ఎవరికైనా ఏకైక గుర్తింపు కాబోతున్నదన్నమాట. ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో విస్పష్టంగా తెలిపారు.