జాతీయ వార్తలు

స్వదేశానికి సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పూర్తి ఆరోగ్యంతో ఆమె స్వదేశంచేరుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 70 ఏళ్ల సోనియాగాంధీ ఈనెల మొదటి వారంలో అమెరికా వెళ్లారు. మా మూలు ఆరోగ్యపరీక్షల నిమిత్తమే ఆమె అక్కడకి వెళ్లారని వారన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న తరువాత ఈనెల 16న తల్లి దగ్గరకు వెళ్లారు. సోనియా చాలా ఏళ్ల తరువాత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన వరుస ఎన్నికల్లో పరాజయం, ముఖ్యంగా యూపీలో ఘోర ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తప్పవని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రకటించారు. స్వదేశం తిరిగొచ్చిన సోనియా, రాహుల్‌లు ఇప్పుడు దానిపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. కొందరు పార్టీ నాయకులు శుక్రవారం నాడు రాహుల్‌ను కలవడం గమనార్హం. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని గత కొన్ని నెలలుగా రాహులే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.