జాతీయ వార్తలు

క్షమాపణ ప్రసక్తే లేదు: గైక్వాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన చర్యకు ఫలితాన్ని ఎదుర్కోక తప్పడం లేదు. న్యూఢిల్లీనుంచి పుణెకు ఆయన బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను ఎయిర్‌ఇండియాతో పాటుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సైతం రద్దు చేయడమే కాకుండా ఆయనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. నిజానికి ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్, గోఎయిర్ సభ్యులుగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) గైక్వాడ్ తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించాయి. ఈ ఎంపి మా విమానాల్లో ప్రయాణించకుండా తక్షణం నిషేధించాలని ఎయిర్ ఇండియా, ఎఫ్‌ఐఏ సభ్య సంస్థలు నిర్ణయించాయని ఇండిగో అసోసియేట్ డైరెక్టర్ ఉజ్జ్వల్ డే ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగి ఆత్మగౌరవాన్ని, ప్రయాణికుల సేఫ్టీని కాపాడడం కోసం ఇలాంటి సంఘటనల్లో తీవ్రమైన చర్య తీసుకోవాలని తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు. కాగా, గైక్వాడ్‌పై చర్య తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సైతం హామీ ఇచ్చారు.మరోవైపు తానుగా గైక్వాడ్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేనని, ఎవరైనా సభలో ఈ విషయం ప్రస్తావిస్తే చర్య గురించి ఆలోచిస్తానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు.
కాగా, అంతకు ముందు మహారాష్ట్ర సదన్ వద్ద మీడియాతో మాట్లాడిన గైక్వాడ్ తన చర్యలకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఎయిర్ ఇండియా మేనేజర్ సుకుమార్‌కు క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేసిన గైక్వాడ్ వాస్తవానికి ఆయనే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మీ స్పందన ఏమిటని మీడియా వాళ్లు అడిగినప్పుడు నిన్న రాత్రి తాను ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ సినిమా చూడ్డానికి వెళ్లానని ఆయన చెప్పారు. ఈ సంఘటన తర్వాత తాను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతో మాట్లాడలేదని గైక్వాడ్ చెప్తూ, లోక్‌సభ స్పీకర్, పౌరవిమానయాన శాఖ మంత్రికి మాత్రం లేఖలు రాసినట్లు తెలిపారు. అంతేకాదు దమ్ముంటే పోలీసులు తనను అరెస్టు చేసుకోవచ్చని కూడా ఆయన సవాలు విసిరారు. కాగా, గైక్వాడ్‌పై ఎయిర్‌ఇండియా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

చిత్రాలు..శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వస్తారన్న సమాచారంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతాసిబ్బంది కాపలా.
* గైక్వాడ్ ప్రవర్తనకు నిరసనగా విమానాశ్రయం వద్ద ఆమ్‌ఆద్మీ సేన కార్యకర్తలు గులాబీలు, చెప్పులతో ప్రదర్శన