జాతీయ వార్తలు

మృత్యుఘోష మధ్య దిగొచ్చిన డాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: తక్షణం విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని బాంబే హైకోర్టు తీవ్ర హెచ్చరికలు చేయడంలో మహారాష్ట్ర వ్యాప్తంగా గత అయిదు రోజులుగా సమ్మె చేస్తున్న రెసిడెంట్ డాక్టర్లు దిగివచ్చి తమ ఆందోళనను విరమించుకోవడానికి అంగీకరించారు. తమ సమ్మె కారణంగా ఒక్క ముంబయిలోనే 135 మంది రోగులు మరణించడం, డాక్టర్ల తీరు పట్ల హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. అంతకు ముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం సమ్మె చేస్తున్న డాక్టర్ల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారు సమ్మె విరమించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్లు శనివారం ఉదయం 8 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
తక్షణం విధుల్లో చేరాలంటూ గు రువారం తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని డాక్టర్ల తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వెంటనే విధుల్లో చేరాలని, లేంటే టెర్మినేషన్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవలసి వస్తుందంటూ మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్‌కు అల్టిమేటం ఇచ్చింది. ‘డాక్టర్లు మా సానుభూతిని అలుసుగా తీసుకుంటున్నారు’ అని ప్రధాన న్యాయమూర్తి మృదులా చెల్లూర్, జస్టిస్ జిఎస్ కుల్కర్ణిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘వ్యవహారాన్ని మీరు ఇలాగే లాగితే జనం మిమ్మల్ని కొట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితిని మీరు సృష్టిస్తున్నారు’ అని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు డాక్టర్లు ఇదే వైఖరిని కొనసాగించిన పక్షంలో వారిపై ఆస్పత్రి మేనేజిమెంట్లు ఉద్యోగాలనుంచి తొలగించడం సహా ఏ చర్యనైనా తీసుకోవచ్చని కూడా బెంచ్ స్పష్టం చేసింది.
మరోవైపుడాక్టర్ల తీరుపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘జరిగింది చాలు. డాక్టర్లు గనుక ఈ రోజు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోదు’ అని ఫడ్నవిస్ అన్నారు. డాక్టర్లు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని కూడా ఆయన అన్నారు. రోగులు చనిపోయేందుకు అనుమతించమని అంటూ, డాక్టర్ల ప్రతినిధులను కలవడం ద్వారా ప్రతిష్టంభనను తొలగించడానికి తాను చివరి ప్రయత్నం చేయబోతున్నానని, ఒక వేళ డాక్టర్లు గనుక విధుల్లో చేరకపోతే వాళ్లు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నారు. ఆస్పత్రుల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తూ మహారాష్టల్రో డాక్టర్లు గత అయిదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె కారణంగా అత్యవసర సేవలు అందుబాటులో లేక ఒక్క ముంబయిలోనే వివిధ ఆస్పత్రుల్లో 135 మంది రోగులు చనిపోయినట్లు బృహన్ముంబయి కార్పొరేషన్ కోర్టుకు తెలియజేసింది. డాక్టర్ల డిమాండ్‌ను ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తోందని హామీ ఇచ్చినప్పటికీ వారు మొండిగా వ్యవహరించడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఫడ్నవిస్ అన్నారు. రోగులకు సేవ చేస్తామంటూ వారు తీసుకున్న ప్రతినకు భిన్నంగా డాక్టర్లు ప్రవర్తిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

చిత్రం..రెసిడెంట్ డాక్టర్ల సమ్మెకారణంగా శుక్రవారం ముంబైలోని
కెఇఎం ఆసుపత్రిలో మృతిచెందిన రోగి బంధువుల ఆర్తనాదాలు