జాతీయ వార్తలు

రిజర్వేషన్లు తొలగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్లను తొలిగించే ప్రసక్తేలేదని కేంద్రం స్పష్టం చేసింది. రిజరేషన్లకు తాము వ్యతిరేకం కాదని, తమపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక మార్లు ప్రకటించారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ధావర్ చాంద్ గెహ్లాట్ తెలిపారు. ప్రస్తుతం జాతీయ బీసీ కమిషన్ స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎస్‌సిఎస్‌ఈబీసీ)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయాన్ని సమాజ్‌వాది పార్టీ సభ్యులు, విపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఆందోళన చేశారు. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారం భం అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను డిప్యూటీ చైర్మన్ సభకు సమర్పింపజేశారు. అనంతరం జీరో అవర్ ప్రారంభం కాగానే రూల్ నెం 377 కింద ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ సభలో మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రస్తుతం జాతీయ బీసీ కమిషన్ రద్దు చేస్తూ దాని స్ధానంలో సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై అభ్యతంరం వ్యక్తం చేశారు. కేంద్రం కావాలనే కొన్ని బీసీ కులాలకు దశల వారీగా ముఖ్యంగా యాదవ్, కుర్మ, గుజ్జార్, లోధ, వౌర్య మరియు కుష్వాహ లాంటి కులాల రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బీసీల హక్కులను కాలరాసే విధంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. ఈ కొత్త కమిషన్ తీసుకురావడంలో కేంద్రం ఉద్దేశం వేరేగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంలో జేడి(యు) ఎంపీ అలీ అన్వర్ మాట్లాడుతూ బీసీ కులాల మధ్య విభేదాలు తీసుకురావడానికి ఈ కమిషన్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి గెహ్లాట్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే తమ ధ్యేయమని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక మార్లు ప్రకటించారని తెలిపారు. ఎన్‌సిఎస్‌ఈబీసీ ఏర్పాటు చేయడంతో పాటు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి అమలు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డిమాండ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చినందున చర్చ అవసరం లేదని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో సమాజ్‌వాది సభ్యులు కేంద్రమంత్రి సమాధానానికి సంతృప్తి చేందలేదు. దీంతో సమాజ్‌వాది సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. అలాగే ఇతర విపక్ష సభ్యులు తమతమ స్థానంలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం ప్రభుత్వం ఇచ్చినందున ఆందోళన చేయడం సరికాదని ఎస్పీ సభ్యులకు డిప్యూటీ చైర్మన్ వివరించారు. కాని ఎస్పీ సభ్యులు, విపక్ష సభ్యులు డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తిని వినకపోవడంతో చేసేది లేక సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం..రాజ్యసభలో శుక్రవారం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన విపక్ష పార్టీల సభ్యులు