జాతీయ వార్తలు

పసుపు బోర్డు కావలసిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: పసుపు బోర్డు ఏర్పాటుకు ఉద్దేశించిన టర్మిరిక్ బోర్డు ప్రైవేటు మెంబర్ బిల్లును నిజామాబాద్ ఎంపీ కవిత లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కవిత విలేఖరులతో మాట్లాడుతూ నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. మన దేశ సంస్కృతిలో పసుపు అంతర్భాగమనీ, దేశంలో పసుపును పండిస్తున్న రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతివ్వాలని కేంద్రాన్ని, పార్లమెంట్‌లోని ఇతర పార్టీల ఎంపీలకు కవిత విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు వల్ల తెలంగాణకు న్యాయం జరగడం లేదని ఆమె వెల్లడించారు. పసుపుబోర్డును పసుపు పండే చోట ఏర్పాటు చేయాలని, దేశంలో ఎక్కడ పెట్టిన అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వాణిజ్య పంటలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే పసుపు పంట వలన కేంద్రానికి ప్రతి ఏడాది వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఆమె పేర్కొన్నారు.
పసుపు బోర్డు సాధనలో వెనక్కి తగ్గేదిలేదని, దాని కోసం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఇతర పార్టీల ఎంపీలు, యోగా గురువు బాబా రాందేవ్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామని చెప్పారు. నేటి నుంచి కరీంనగర్-నిజామాబాద్, నిజామాబాద్-కరీంనగర్ రైల్వే సేవలు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు.