జాతీయ వార్తలు

సుప్రీం కోర్టే పరిష్కారం చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 26: కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నంత వరకూ అయోధ్య సమస్యకు కోర్టు వెలుపలి పరిష్కారం సాధ్యం కాదని బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ (బిఎమ్‌ఎసి) తేల్చిచెప్పింది. వీరిద్దరూ కీలక పదవుల్లో ఉన్నంత కాలం ముస్లింలకు న్యాయం జరుగుతుందన్న ఆశలేదని, వీరు బిజెపి కార్యకర్తలే కాకుండా, రామజన్మభూమి ఉద్యమంలో పాలుపంచుకున్నవారేనని బిఎమ్‌ఎసి కన్వీనర్ జఫరాయబ్ జిలానీ అన్నారు. గతంలో వివాదాస్పద అంశాల విషయంలో ప్రధాన మంత్రులు తటస్థంగా ఉండేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పుతోనే అయోధ్య సమస్య పరిష్కారం కావాల్సిందేనని ఉద్ఘాటించారు. ఈ వివాదంపై సంబంధిత వర్గాలు కూర్చుని మాట్లాడుకుని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో జిలానీ మాట్లాడారు.