జాతీయ వార్తలు

కరవు ప్రాంతాలకు ప్రత్యేక నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం కరవు ప్రభావిత రాష్ట్రాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం చర్చించి సమస్యల పరిష్కారం చూపాలని సిపిఐ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశంలో పాల్గొన్న సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, నారాయణ, తెలుగు రాష్ట్రాల నుంచి రామకృష్ణ, చాడ వెంకటరెడ్డిలు హాజరయ్యారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సిపిఐ జాతీయ కార్యవర్గంలో చర్చించారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలో కరువు పరిస్థితులపై తీర్మానం చేసింది. అనంతరం సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేసినేని, దివాకర్ ట్రావెల్స్ దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందిని మండ్డిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.