జాతీయ వార్తలు

వెల్లువలా ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కేంద్ర ప్రభుత్వోద్యోగాలు వెల్లువెత్తను న్నాయ. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్ అంచనాల్లో 2017 నాటికి సుమారు 2.18 లక్షల ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది. 2015 నాటికి 33.05 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కొత్తగా 5,635 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు. దీంతో ఈ శాఖలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 22,006కు పెరుగుతుంది. ఇదేవిధంగా పోలీసు విభాగాలలో కొత్తగా 47,264 ఉద్యోగాలు సృష్టిస్తారు. దీంతో ఈ విభాగాలలో 2017 నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 10,75,341కి పెరుగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖలో కొత్తగా కల్పించే 10,894 ఉద్యోగాలతో 2017 నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 51,084కు పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు సుపరిపాలనను అందించడానికి దోహదపడతాయని కేంద్ర సిబ్బంది, ప్రజాసమస్యలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఒక వార్తాసంస్థకు చెప్పారు.
బడ్జెట్ అంచనాల ప్రకారం పౌర విమానయాన శాఖలో కొత్తగా సృష్టించే 1,080 ఉద్యోగాలతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 2,140కి చేరుకుంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలో కొత్తగా సృష్టించే 6,353 ఉద్యోగాలతో మొత్తం మానవ వనరుల సంఖ్య 38,025కు పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 2015లో 8,913 ఉద్యోగాలు ఉండగా, కొత్తగా 2,072 ఉద్యోగాలు సృష్టించనున్నారు. గనుల మంత్రిత్వ శాఖలో 8,503 ఉద్యోగాలు ఉండగా, కొత్తగా 4399 ఉద్యోగాలు సృష్టించనున్నారు. సిబ్బంది వ్యవహారాల శాఖలో 8,568 ఉద్యోగాలు ఉండగా, కొత్తగా 1,796 ఉద్యోగాలు సృష్టించనున్నారు. ప్రతి పథకంలో ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలను తెలియజేయాలని కేబినెట్ సెక్రటేరియట్ ఇదివరకే అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అలాగే ఈ కొత్త ఉద్యోగాల కల్పనకు కేంద్ర కేబినెట్, దాని కమిటీల ఆమోదం తీసుకోవాలని సూచించింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, పెట్టుబడుల ఉపసంహరణ (డిజినె్వస్ట్‌మెంట్)పై ఏర్పాటు చేసిన కోర్ గ్రూప్‌ల ఆమోదం కోసం పంపించే అన్ని ప్రతిపాదనలలో ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలను పొందుపరచటం తప్పనిసరని కేబినెట్ సచివాలయం తెలిపింది.

చిత్రం కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్