జాతీయ వార్తలు

ఆ ప్రశ్నకు బదులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఎందుకు ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ ప్రశ్న ‘సమాచారం’ అనే నిర్వచనం పరిధిలోకి రాదని రిజర్వు బ్యాంకు పేర్కొంది. దేశంలో పెద్ద నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తూ, ప్రజల వద్ద ఉన్న పాత 1000, 500 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు గడువు ఇస్తామని స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే ఈ గడువును విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మాత్రమే వర్తింప జేయాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా విచారణ జరుపుతుండటంతో పాత నోట్ల మార్పిడి విషయమై ప్రధాని చేసిన ప్రకటన న్యాయ పరీక్షలో నెగ్గుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే పాత నోట్లను మార్చుకునేందుకు ప్రవాస భారతీయులకు మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలన్న నిర్ణయానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు రిజర్వు బ్యాంకు నిరాకరిస్తూ, ఈ వివరాలను వెల్లడించడం వలన దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ప్రధాని ప్రకటించినట్లుగా దేశ ప్రజల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇవ్వకపోవడానికి ఆర్‌బిఐ వద్ద ఉన్న కారణాలేమిటో వెల్లడించాలని ఆర్‌టిఐ పిటిషనర్ కోరారు. అయితే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం ఈ ప్రశ్న ‘సమాచారం’ అనే నిర్వచనం పరిధిలోకి రాదని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేర్కొంటూ, సమాధానమిచ్చేందుకు నిరాకరించారు.