జాతీయ వార్తలు

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: మన దేశ గుర్తింపుతోపాటు శక్తిసామర్ధ్యాలన్నీ భిన్నత్వంలో ఏకత్వం అనే భావనలోనే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీలో ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనే వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రకృతిలో వచ్చే మార్పులతో ఎంతో అనుబంధం ఉందన్నారు. దేశంలో భాషాపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలతో వాటిని అధిగమించగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం గురించి మోదీ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలను మరో ప్రాంతం వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోచ్చామన్నారు. భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాలంటే అన్ని వర్గాల ప్రజలు మరింత ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, భాషలు, వంటకాలు, క్రీడలకు సంబంధించి హర్యానా-తెలంగాణ రాష్ట్రాలు వివిధ ఒప్పందాలు కుదుర్చుకోన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా 100 తెలుగు పదాలను హర్యానా విద్యార్థులు, 100 హర్యాణి పదాలను తెలంగాణ విద్యార్థులు నేర్చుకొనున్నారని, అలాగే తెలుగు చిత్రాలను హర్యానాలో, హర్యానా చిత్రాలను తెలంగాణలో ప్రదర్శంచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విధంగా చేయడం ఇరు రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను పరస్పరం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, కనుక ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని మోదీ అన్నారు.
ఉగాది వేడుకల్లో ప్రదర్శించిన రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, చెడుపై మొదట పోరటం చేసింది జటాయువేనని, అందుకే జటాయువు అభయానికి మారుపేరుగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జటాయువును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొలుత మాడుగుల నాగఫణి శర్మ కొత్త సంవత్సర పంచాంగ శ్రవణాన్ని అతిథులకు వినిపించారు. అనతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో ఈ ఏడాది దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్తుందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఈ వేడుకల్లో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించగా, అతిథులకు వెంకయ్య నాయుడు ఉగాది పచ్చడితోపాటు దక్షిణాది వంటకాలను రుచి చూపించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రోహిణి, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, మహేష్ శర్మ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పలువురు బిజెపి ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీలోని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో నిర్వహించిన

చిత్రం..ఉగాది వేడుకల్లో ప్రదఠ్శన ఇచ్చిన కళాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ