జాతీయ వార్తలు

కృష్ణమూర్తిని అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 27: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జె.కృష్ణమూర్తి అనే ఈ వ్యక్తి కోర్టును మోసం చేయటమే కాకుండా వివిధ డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేసి నేరానికి పాల్పడ్డాడని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. జయలలిత మరణానంతరం ఆమె కొడుకును తానేనంటూ, ఆమెకు చట్టబద్ధమైన వారసుడినీ తానేనని పేర్కొంటూ కృష్ణమూర్తి కోర్టులో పిటిషన్ వేశాడు. జయలలితకు, దివంగత తెలుగు నటుడు శోభన్‌బాబుకు పుట్టిన కొడుకునని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనకు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళ నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర డిజిపిని కూడా కోరాడు. తాను 1985లో జన్మించానని. ఆ తరువాత తనను ఈరోడ్‌లో ఉండే వసంతమణి కుటుంబానికి దత్తత ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వసంతమణి 1980లలో మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ఇంట్లో పనిచేసేది. ఈ డాక్యుమెంట్‌లలో జయలలిత, శోభన్‌బాబు, వసంతమణి సంతకాలను ఫోర్జరీ చేశాడు. కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. సెంట్రల్ క్రైం బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన మీదట న్యాయస్థానం కృష్ణమూర్తి అరెస్టుకు ఆదేశాలిచ్చింది. ‘కృష్ణమూర్తి నకిలీ డాక్యుమెంట్‌లను సృష్టించాడు. కోర్టును సైతం మోసం చేశాడు. తక్షణం అరెస్టు చేసి జైలుకు పంపించాలని ఆదేశిస్తున్నాను’ అని జస్టిస్ మహదేవన్ అన్నారు. కృష్ణమూర్తి వెంటనే పోలీస్ కమిషనర్ ఎదుట హాజరై ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించారు. ఎల్‌కెజి విద్యార్థికి ఈ డాక్యుమెంట్‌లు చూపించినా అవి ఫోర్జరీవని తేలిగ్గా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.