జాతీయ వార్తలు

ఆరు నెలల్లో సంస్థాగత ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఇసి మరో ఆరునెలల గడువిచ్చింది. గడువు పెంచాల్సిందిగా కాంగ్రెస్ చేసుకున్న అభ్యర్థనకు ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ 31నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘2017 డిసెంబర్ నెలఖరునాటికి వ్యవస్థాగత ఎన్నికలు పూర్తిచేసుకోండి. మరోసారి గడువు పెంచేది లేదు’ అని ఇసి పేర్కొంది. తొలుత జూన్ 30 నాటికి వ్యవస్థాగత ఎన్నికలు పూర్తిచేయాలని ఎన్నికల తెలిపింది. తాజాగా గడువు పెంచిన నేపథ్యంలో అప్పటికి రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్‌కు అవకాశం దక్కినట్టయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘరపరాజయంతో కుదేలై సంస్థాగతంగా అనేక మార్పులు చేయనుంది. కాంగ్రెస్ వ్యవస్థాగత ఎన్నికలకు డిసెంబర్ 31 వరకూ గడువు పొడిగించినట్టు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది సోమవారం ఇక్కడ వెల్లడించారు.