జాతీయ వార్తలు

కేంద్ర ప్రభుత్వానికే సింహభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27:జిఎస్‌టి పరిహార మొత్తంలో రాష్ట్రాలకు చెల్లించగా మిగిలిన నిధుల్లో సింహభాగం కేంద్రానికే చెందుతుంది. సోమవారం జిఎస్‌టికి సంబంధించిన నాలుగు బిల్లులను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇంతకు ముందు ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నష్ట పరిహార నిధుల చెల్లింపులో సానుకూల పరిస్థితి ఉండేది. ఇప్పుడు జిఎస్‌టి విధానాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసిన తర్వాత మిగిలే మొత్తంలో అగ్రతాంబూలం కేంద్రానికే చెందుతుంది.
జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలు పన్నుల ఆదాయం కోల్పోతాయి కాబట్టి దాన్ని భర్తీ చేసే రీతిలో రెండు నెలలకోసారి నిధుల్ని చెల్లిస్తారు. ముసాయిదా చట్టంలో ప్రతి మూడు నెలలకోసారి ఈ నష్ట పరిహారం చెల్లిస్తామన్న అంశం ఉంది. ఐదేళ్ల అమలు తర్వాత జిఎస్‌టి పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని నిర్ణీత ఫార్ములా ప్రకారం పంచుతారు. అంటే మిగులు నిధుల్లో 50శాతం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటాయి. ఇక మిగిలిన 50శాతం నిధుల్లో రాష్ట్రాలకు అంతకు ముందు సంవత్సర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే వాటా కల్పిస్తారు. పరిహార నిధుల పంపిణీకి సంబంధించి కూడా జిఎస్‌టి నిబంధనలను మరింతగా సరళతరం చేశారు. లగ్జరీ, ఇతర వస్తువులపై సెస్ విధించడం ద్వారా నష్ట పరిహార నిధిని ఏర్పాటు చేయాలని జిఎస్‌టి మండలి నిర్ణయించింది. మొదటి ఐదేళ్ల పాటు జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఈ మొత్తం నుంచి భర్తీ చేస్తారు. పరిహార నిధి లెక్కల్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిశీలించాలని కూడా తాజా బిల్లు నిర్దేశిస్తోంది. చివరి సంవత్సరం జరిగే ఆడిట్ లెక్కల ప్రకారమే రాష్ట్రాలకు ఎంత పరిహారం చెల్లించాలన్న మొత్తాన్ని నిర్ణయిస్తారు.