జాతీయ వార్తలు

పాలనపై ‘ఆదిత్య’ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 27: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టే పని మొదలెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే పలు కీలకమై నిర్ణయాలు తీసుకున్న ఆయన పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తున్నారు. తొలిసారి తన కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి పాలనలో జవాబుదారీతనం, సమయపాలన, శుభ్రత వంటి విషయాల్లో కచ్చితంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో చూయింగ్ గమ్, గుట్కాలు నమిలి ఊయడంపై నిషేధించాలని నిర్ణయించారు. బయోమెట్రిక్ విధానం, సిసిటివి కెమెరాలు ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. మర్నాడే మంత్రులు, సీనియర్ అధికారులందరితో చీపుర్లు పట్టి శుభ్రం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోవధను నిషేధించడం, అలాగే ఆకతాయిలను అడ్డుకునేందుకు కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులు పట్ల ఏమాత్రం మెతకవైఖరి వద్దని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బిజెపి నేతలు, ప్రజాప్రతినిధులు ఎలాంటి కాంట్రాక్ట్ పనులను చేపట్టవద్దని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో పర్యటించిన ఆయన కష్టించి పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మంత్రులెవరూ ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్లొద్దని, ఆఫీసుల్లోనే వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు చేశారు. మూడు నెలలపాటు రాష్ట్రంలో ఓ మంచి వాతావరణం నెలకొల్పితే ప్రజలందరూ మెచ్చుకుంటారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉందని ఆదరణ పొందుతామని ఆయన ఉద్ఘాటించారు. రాష్టవ్య్రాప్తంగా మహిళా పోలీసుల సంఖ్యను పెంచనున్నట్టు ఆదిత్యనాథ్ ప్రకటించారు. అవినీతిని పారద్రోలతామన్న సిఎం మంత్రులు, అధికారులు 15 రోజుల్లో ఆస్తుల వివరాలు వెల్లడించాలని అన్నారు. జూన్ 15నాటికి ఏ రోడ్డు గుంతలతో కనిపించకూడదని, తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజాపనుల శాఖకు సూచించారు. యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టాక యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డ్రెస్‌కోడ్ ఉల్లంఘిస్తే జీతంలో కోత విధిస్తామని సిఎం హెచ్చరికను వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. నివేదికలు, గణాంకాలు కచ్చితంగా ఉండాలన్న సిఎం ఆదేశాలు అధికారుల్లో నిద్రలేకుండా చేస్తున్నాయి.

చిత్రం..సమాజ్‌వాది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేట్టిన గోమతి రివర్‌ప్రంట్ ప్రాజెక్టును
ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మతో కలిసి పరిశీలిస్తున్న యూపీ సిఎం ఆదిత్యనాథ్