జాతీయ వార్తలు

గైక్వాడ్‌కు దక్కని ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమాన ప్రయాణాలపై విధించిన నిషేధం ఎత్తివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. ఎంపీపై నిషేధం ఎత్తివేయాలంటూ సోమవారం లోక్‌సభలో శివసేన డిమాండ్ చేసింది. అయితే దీనిపై శివసేనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. లోక్‌సభలో శివసేన పక్ష నేత ఆనందరావు అడ్సుల్ ఈ అంశాన్ని లేవనెత్తిరు. గైక్వాడ్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన కోరారు. ఈ నెల 23న అరవై ఏళ్ల ఎయిర్ ఇండియా డ్యూటీ మేనేజర్‌పై ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దాడి చేశాడు. దీంతో అతడిని ప్రధాన విమానాల్లో ప్రయాణించకుండా ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. శివసేన పక్షనేత అడ్సుల్ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సభలోనే ఉన్న పౌర విమానయాన మంత్రి పి అశోక్‌గజపతిరాజు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. హింస ఏ రూపంలో ఉన్నప్పటికీ తప్పేనని, ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యులైనా ఉపేక్షించకూడదని మంత్రి స్పష్టం చేశారు. ‘ఎంపీ ప్రవర్తన గర్హనీయం. ఉన్నత ఉద్యోగిపై దాడి చేయడం సరైందికాదు’ అని అన్నారు. భద్రతా నిబంధలను అమలు చేయడం డిజిసిఏ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులుకారు. గత ఏడాది కూడా ఓ ఎంపీ ప్రవర్తనపై అలాంటి చర్యలే తీసుకున్నట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అవే నిబంధనలు గైక్వాడ్‌కు వర్తిస్తాయని మంత్రి తేల్చిచెప్పారు. గైక్వాడ్‌పై నిషేధం రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకమని అడ్సుల్ ఆరోపించారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని నిషేధం ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఎంపీల హక్కులపై అడ్సుల్ మాట్లాడుతుండగా మంత్రి జోక్యం చేసుకుంటూ ‘ఎంపీ కూడా ప్రయాణికుడే. చట్టానికి అతడు అతీతుడుకాదు. భద్రత సూత్రాలు ఎవరైనా పాటించాల్సిందే’ అని స్పష్టం చేశారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని శివసేన ఎంపీలు వెల్‌లోకి వచ్చి తమ నిరసన తెలిపారు. తప్పుచేసిన వ్యక్తిని సమర్థించడం మంచి సంప్రదాయం కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడితే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ఆమె ప్రశ్నించారు.

చిత్రం..శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్