జాతీయ వార్తలు

మరో మెట్టెక్కిన జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: ఒకే విధమైన పన్ను చట్టాన్ని జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం జిఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. అవి సెంట్రల్ జిఎస్‌టి బిల్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి బిల్లు, కేంద్ర పాలిత జిఎస్‌టి బిల్లు, నష్టపరిహార జిఎస్‌టి బిల్లు. ఐదో బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభల్లో ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడే కొత్త జిఎస్‌టి పన్నుల విధానం అమలులోకి వస్తుంది. సప్లిమెంటరీ అజెండా ద్వారా జిఎస్‌టి బిల్లుల ప్రతిపాదనను ప్రభుత్వం సోమవారం సభ ముందుకు తెచ్చింది. దీనిని కాంగ్రెస్‌కు చెందిన వేణుగోపాల్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు సౌగత్ రాయ్ వ్యతిరేకించారు. జిఎస్‌టికి తాము వ్యతిరేకం కాదని, ప్రతిపాదించేందుకు అనుసరిస్తున్న విధానమే బాగాలేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు వారు నిరసన తెలుపుతూ తమ అభ్యంతరాలపై రూలింగ్ ఇవ్వాలని వేణుగోపాల్, సౌగత్ రాయ్ స్పీకర్‌ను కోరారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అహ్లూవాలియా బదులిస్తూ, జిఎస్‌టి బిల్లులు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత తమకు అందగానే వాటిని మొదట సభ్యులందరికీ ఇంటర్‌నెట్‌లో పంపించాము. ఆ తరువాత శనివారం ఉదయం బిల్లు ముసాయిదా కాపీలను సభ్యుల ఇంటికి పంపించామని వివరించారు. అహ్లువాలియా ఇచ్చిన వివరణతో వేణుగోపాల్, సౌగత్ రాయ్, ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంతృప్తి చెందలేదు. దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ సప్లిమెంటరీ అజెండాద్వారా జిఎస్‌టి బిల్లులను సభలో ప్రతిపాదించేందుకు తాను ప్రత్యేక అనుమతి ఇచ్చానని ప్రకటించారు. స్పీకర్ అనుమతి లభించగానే అరుణ్ జైట్లీ లేచి జిఎస్‌టి చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులను వరుసగా సభ ముందు ప్రతిపాదించారు.
సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించిన ఈ బిల్లులను ఏప్రిల్ 12లోగా ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి పన్నుల విధానాన్ని జిఎస్‌టి ద్వారా సంస్కరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వివిధ పరోక్ష పన్నులను ఏకీకృతం చేసి ఒకే పన్ను విధానాన్ని అమలు చేయనున్నారు. కొత్త విధానం వలన ఆదాయం పెరగటంతోపాటు పన్నుల వసూళ్లకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిఎస్‌టి నాలుగు స్థాయిల విధానం అమలులోకి వస్తుంది. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉంటాయి. ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించిన తరవాత రాజ్యసభకు వెళతాయి. జిఎస్‌టి బిల్లులను ద్రవ్య బిల్లులుగా లోక్‌సభలో ప్రవేశ పెట్టినందున వీటిని రాజ్యసభ ఆమోదించకపోయినా ఎలాంటి సమస్య ఉండదు.

చిత్రం.. సోమవారం పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ