జాతీయ వార్తలు

తలాఖ్‌పై సవాలు పిటిషన్లు విచారణ యోగ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: ముస్లింలకు సంబంధించిన తలాఖ్, నిఖా హలాలా, బహు భార్యత్వం వంటి అంశాలు న్యాయ వ్యవస్థ పరిధిలోనివి కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎమ్‌పిఎల్‌బి) సుప్రీం కోర్టుకు నివేదించింది. వీటిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు ఎంతమాత్రం విచారణ యోగ్యమైనవి కాదని స్పష్టం చేసింది. పవిత్ర ఖురాన్, ఇతర అంశాల ప్రాతిపదికగా రూపొందిన మహమ్మదీయ చట్టం చెల్లుబాటును రాజ్యాంగ నిబంధనల ప్రకారం పరీక్షించజాలరని తెలిపింది. ఇలాంటి సవాలు పిటిషన్ల విషయంలో న్యాయపరమైన సహనశీలత అవసరమని ముస్లిం బోర్డు ఉద్ఘాటించింది. ఈ పిటిషన్లన్నీ కూడా శాసన పరిధిలోకి వచ్చేవేనని తెలిపింది. విడాకుల అంశం వ్యక్తిగతమైనదని, దీన్ని ప్రాధమిక హక్కుల పరిధిలోకి చేర్చి అమలు చేయడం సమంజసం కాదని తెలిపింది. అసలు ఈ సవాలు పిటిషన్‌లన్నీ తప్పుడు భావనలతో ముస్లిం పర్సనల్ లా పట్ల ఎలాంటి అవగాహన లేకుండా దాఖలైనవేనని తెలిపింది. మతానికి సంబంధించిన అంశాల్ని నిర్వహించుకునే స్వేచ్ఛను ప్రతిమత వర్గానికీ రాజ్యాంగం కల్పిస్తోందని తెలిపింది.