జాతీయ వార్తలు

పిఎఫ్ వడ్డీ రేటు కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఇపిఎఫ్‌ఓ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరిస్తూ పిఎఫ్ వడ్డీ రేటును 2015-16 సంవత్సరానికి గాను 8.7శాతంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పిఎఫ్ వడ్డీ రేటును 8.8శాతంగా కొనసాగించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఉన్న ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ 8.7శాతం వడ్డీ రేటునే ఆమోదించింది. పిఎఫ్ వడ్డీ రేటును తగ్గించడం కార్మికుల వ్యతిరేక నిర్ణయమంటూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు విరుచుకు పడుతున్నాయి. దాదాపు ఐదు కోట్ల మంది పిఎఫ్ చందాదారులపై వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం పడుతుంది. తాము 8.8శాతం మేర వడ్డీ ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7శాతం వడ్డీ రేటునే ఆమోదించిందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. పిఎఫ్ వడ్డీ రేటును తగ్గించడంపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ బిఎమ్‌ఎస్ సహా అనేక కార్మిక సంఘాలు విరుచుకు పడ్డాయి.దీనికి నిరసనగా దేశ వ్యాప్తంగా 27న అన్ని పిఎఫ్ కార్యాలయాల ముందు ధర్మా చేస్తామని తెలిపింది. స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సిబిటి తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఇపిఎఫ్ పనితీరులో జోక్యం చేసుకోవడమేనని ఇతర కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. ఇపిఎఫ్‌ఓకు కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వదని, ఇందులో ఉన్న మొత్తమంతా కార్మికుల కష్టార్జితమని ఐటియూసి అధ్యక్షుడు అశోక్ సింగ్ స్పష్టం చేశారు. మార్కెట్ రేటుకు దగ్గరగా ఉంచే ఉద్దేశంతో పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర సహా అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును కేంద్రం ఇటీవల తగ్గించింది.ఆ నేపథ్యంలోనే పిఫ్ వడ్డీనీ తగ్గించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.