జాతీయ వార్తలు

కర్నూలు, కాకినాడ ఆసుపత్రులకు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: పీఎమ్‌ఎస్‌ఎస్‌వై పథకం కింద కర్నూలు, కాకినాడ ప్రభుత్వాసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారంనాడు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవడేకర్, సురేష్ ప్రభులతో శ్రీనివాస్ సమావేమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి అవరోధాలపై కేంద్రం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. కర్నూలు, కాకినాడ ఆసుపత్రిల అభివృద్ధికి రూ.150కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్టు వెల్లడించారు. నీట్‌లో పీజీ విద్యార్థులకు క్వాలిఫయింగ్ మార్కులను తగ్గించాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరినట్టు పేర్కొన్నారు. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష కేంద్రాలను కర్నూలు, రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కోరినట్లు కామినేని వెల్లడించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుని కలసి పశ్చిమ గోదావరి జిల్ల కొవ్వూరు నుంచి భద్రాచలంకు రైలుమార్గం త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. సురేష్ ప్రభు తన ఎంపీలు నిధుల ద్వారా రాష్ట్రానికి 13 అంబులెన్సులు మంజూరు చేశారని వీటిని ప్రారంభించడానికి ఆయనను ఆహ్వానించినట్లు కామినేని తెలిపారు.