జాతీయ వార్తలు

మానసిక రోగుల ఆత్మహత్యాయత్నం నేరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: మానసిక ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులు ఆత్మహత్యకు యత్నిస్తే అది ఎంతమాత్రం నేరం కాదన్న నిబంధనతో మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్‌లో పేర్కొన్న అంశాలతో నిమిత్తం లేకుండా ఏ వ్యక్తి అయినా ఆత్మహత్యకు యత్నిస్తే అతడు తీవ్ర స్థాయిలో మానసిక ఒత్తిడికి లోనయినట్లుగా భావించాల్సి ఉంటుందని ఈ బిల్లులో స్పష్టం చేశారు. అంతేకానీ ఇలాంటి కేసులను పీనల్ కోడ్ ప్రకారం విచారించి అలాంటి వ్యక్తులను శిక్షించటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇతరత్రా మరెలాంటి బలమైన కారణాలు లేకపోతే, మానసిక ఒత్తిడి కారణాలతోనే ఆత్మహత్యకు యత్నించినట్లుగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తుల ఆస్తి హక్కును కూడా పునరుద్ధరించాలని, దాన్ని పరిరక్షించాలన్న నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోవటంతో మూజువాణి ఓటుతో లోక్‌సభ దీన్ని ఆమోదించింది.