జాతీయ వార్తలు

కరవు కోరల్లో ‘సీమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: రాయలసీమలో నెలకొన్న తీవ్ర కరవు మూలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామందర్‌రావు ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమకు వెంటనే ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనద్వారా రాయలసీమలో నెలకొన్న కరవు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రాయలసీమలో పంటలు బాగా దెబ్బతిన్నాయి, వ్యవసాయ కార్మికులకు పని లేకుండాపోయింది, ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు, బోరు బావులు దాదాపుగా ఎండిపోయాయని ఆయన వివరించారు. అనంతపురం జిల్లాలో కరవు మరింత భయంకరంగా ఉన్నది, కరవు పరిస్థితులను తాను స్వయంగా చూసి వచ్చానని రామచందర్‌రావు చెప్పారు. మంచినీటికోసం మైళ్ల కొలది నడవాల్సి వస్తోంది, వలసలు ప్రారంభమయ్యాయని రామచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్తాన్‌లోని జైసల్మేర్ తరువాత అతి తక్కువ వర్షం రాయలసీమలోని అనంతపురంలో రికార్డు అవుతుందనేది అందరికి తెలిసిందేనని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయ పునరావాస చర్యలు తీసుకోకపోతే పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని ఆయన హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికపై మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంట రుణాలను మాఫీ చేయటంతోపాటు వ్యవసాయ కార్మికులు, రిక్షా కార్మికులు, చిన్న వ్యాపారస్తుల రుణాలను రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.