జాతీయ వార్తలు

రిజర్వులో ‘లోక్‌పాల్’ తీర్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: లోక్‌పాల్ నియామకానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం వాదోపవాదాలు విన్నది. ‘అన్ని పక్షాల వాదనలు విన్నాం. తీర్పును రిజర్వులో ఉంచుతున్నాం’ అని బెంచ్ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్లే లోక్‌పాల్ నియామకంలో జాప్యం నెలకొందని అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గి కోర్టుకు తెలిపారు. లోక్‌పాల్ చట్టం కింద ప్రతిపక్ష నేత ఎవరనేది నిర్వచించే అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు. 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టం కింద లోక్‌సభలో ప్రతిపక్ష నేత లోక్‌పాల్ ఎంపిక ప్యానెల్‌లో సభ్యుడిగా ఉంటారని, ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నేత లేరని వెల్లడించారు. లోక్‌సభలో ఏకైక పెద్దపార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ దానికి ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి సరిపడా ఎంపీలు లేరని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి సవరణ చేస్తేనే తప్ప లోక్‌పాల్ నియామకం జరగదని పేర్కొన్నారు. కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ శాంతి భూషణ్ వాదిస్తూ 2013లో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, 2014నుంచి అమల్లోకి వచ్చిందని, అయితే కేంద్రం ఉద్దేశపూర్వకంగానే లోక్‌పాల్ నియామకాలు జరపకుండా దాటవేస్తోందని ఆరోపించారు.