జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాఖ్ పిటిషన్లన్నీ రాజ్యాంగ ధర్మాసనానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ట్రిపుల్ తలాఖ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ గురువారం సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం వేసవి సెలవుల అనంతరం మే 11 నుంచి అన్ని పిటిషన్లను విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ప్రకటించింది. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దుచేయాలంటూ పలు సంస్థలు, మహిళలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తున్న ఈ చట్టాన్ని రద్దుచేస్తే తాను బిజెపికే ఓటేస్తానని లక్నోకు చెందిన ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అయితే అఖిల భారత ముస్లిం లా బోర్డు మాత్రం ట్రిపుల్ తలాఖ్‌ను సమర్థించుకుంటోంది. ఓ మహిళ చనిపోవడం కంటే విడాకులే మంచిదని బోర్టు వాదిస్తోంది.