జాతీయ వార్తలు

అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు బాబు అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌లో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతి ఇచ్చారని పిఎంఓ సహాయ మంత్రి జితేందర్ సింగ్ గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. టిడిపి సభ్యుడు సి.ఎం.రమేష్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు ఈనెల 25న రాష్ట్రంలో అణువిద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు అవసరమైన భూమిని సేకరించేందుకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేశారని తెలిపారు. అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంలో ఏపి ప్రభుత్వం తమకు పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. రమేష్ మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించవలసిన వెస్టింగ్ హౌస్ దివాళా తీయటం గురించి ప్రశ్నించారు. అవి దివాళా తీసిన నేపథ్యంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ పథకం ఏదైనా ఉన్నదా? అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రశ్నించారు. స్వదేశీ సాంకేతిక పరిజానం ఆధారంగా అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారా? అని ఆయన అడిగారు. జితేందర్ సింగ్ సమాధానం ఇస్తూ స్వదేశీ పరిజానంతో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రకటించారు. ఇక వెస్టింగ్ హౌస్ దివాళా తీసేందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నారు. అమెరికా సాంకేతిక పరిజానంతో ఆరు అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసి ఉన్నది, ఈ విషయంలో తాము వేగంగానే ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఆరు అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తి అయితే 7,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. పని ప్రారంభించిన తరువాత ఐదు సంవత్సరాలకు మొదటి యూనిట్ పని చేయటం ప్రారంభిస్తుందని సింగ్ అన్నారు.