జాతీయ వార్తలు

నెహ్రూ, ఇందిర తర్వాత మోదీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యంత విజయవంతమైన మూడో ప్రధాని కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ తర్వాత మోదీయే అత్యంత విజయవంతమైన ప్రధాని అని ఆయన అన్నారు. మోదీ చరిష్మా, ఆకర్షణ, కులం, మతం, భాష సరిహద్దులను చెరిపేస్తున్నాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండియా సదస్సు 2017లో బుధవారం మాట్లాడిన గుహ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తన నిర్ణయాలు తీసుకునే అధికారం, ముందుచూపు కారణంగానే ఈ స్థాయికి ఎదిగారని గుహ అన్నారు. ‘నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలోనే మూడవ అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి కాబోయే కాలంలో మనం ఉన్నాం. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో అధికారం, కుల మత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించగలిగిన, చరిష్మాను కలిగి ఉన్న నాయకుడు మరొకరు లేరు’ అని ఆయన అన్నారు.
భారతదేశ రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుతూ కులవ్యవస్థ, మహిళల పట్ల వివక్ష అనేవి తిరస్కరించలేని దేశ రాజకీయాల్లో ఉన్న రెండు వాస్తవాలని గుహ చెప్పారు. ఉపఖండంలో రెండు ప్రధాన మతాలయిన హిందూ, ఇస్లాం మతాలు రెండింటిలోను మహిళల పట్ల వివక్ష ఉందని ఆయన అన్నారు. కుల వ్యవస్థ పుట్టినప్పటినుంచి కూడా సమాజంలో కులవ్యవస్థ అత్యంత కఠినమైందని, కుల వ్యవస్థను సృష్టించింది హిందువులేనని కూడా ఆయన అన్నారు. ఇక హిందూ, ఇస్లాం మత గ్రంథాలలోను, వాటి సామాజిక వ్యవస్థలోను మహిళల పట్ల అత్యంత తీవ్రమైన వివక్ష ఉందనేది మరో కఠోర వాస్తవం అని గుహ అన్నారు. 2011-12 సంవత్సరాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేసిన గుహ ఈ సంస్థకు భారతదేశంతో గల చారిత్రక సంబంధం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సంస్థ పూర్వ విద్యార్థి అయిన ప్రముఖ రాజకీయ శాస్తవ్రేత్త హరాల్డ్ లస్కీ చాలామంది భారతీయ సామాజిక శాస్తవ్రేత్తలకు మార్గదర్శకుడే కాక నెహ్రూకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుహ చెప్పారు. బిఆర్ అంబేద్కర్, కృష్ణమీనన్, తార్‌లోక్‌సింగ్‌లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థ పూర్వ విద్యార్థులేనని కూడా ఆయన అన్నారు.

చిత్రం..రామచంద్ర గుహ