జాతీయ వార్తలు

బేషరతుగా క్షమాపణ చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31:కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ధోరణిపై సుప్రీం కోర్టు మరింత కఠిన వైఖరి అవలంబించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా రాసి ధిక్కారానికి పాల్పడ్డందుకు నాలుగు వారాల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఆయనకు పాలనాపరమైన, న్యాయపరమైన విధుల్ని పునరుద్ధరించేందుకు నిరాకరించింది. శుక్రవా రం కోర్టుకు హాజరైన కర్ణన్‌ను ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ సారధ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. వ్యక్తిగత మానసిక స్థితిగతుల గురించి వైద్యపరమైన సర్ట్ఫికేట్లను కోర్టు పరిశీలనకు నివేదిస్తారా అని ఆయన్ని ప్రశ్నించింది. అం దుకు కర్ణన్ నిరాకరించారు. తక్షణమే తన విధులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తన వాదన వినకుండా తన ను విధుల నుంచి ఎందుకు తప్పించారంటూ ప్రశ్నించారు. ‘నేను కూడా రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నాను. తదుపరి విచారణకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పిన కర్ణన్ ‘కావాలంటే సుప్రీం కోర్టు నన్ను అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టవచ్చు’నని అన్నారు.