జాతీయ వార్తలు

సీఎస్టీ బకాయిలు విడుదల చే యండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలు రూ.10,400 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలుకొని తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. అనంతరం ఈటల విలేఖరులతో మాట్లాడుతూ సీఎస్టీ కింద తెలంగాణకు రావాల్సిన మొత్తం బకాయిల్లో కేంద్రం రూ.390 కోట్లు మాత్రమే ప్రస్తుతం విడుదల చేస్తామని చెప్పడం సరికాదన్నారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు కానున్న పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అలాగే పౌర సరఫరాలకు సంబంధించిన లేవీ కింద తెలంగాణకు రావాల్సిన రూ.4 వేల కోట్లును, వెనుకబడిన జిల్లాలకు రెండో విడత రావాల్సిన రూ.450 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిని నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి పిఎంజీఎస్‌వై కింద వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో సమావేశమై ఆదిలాబాద్, నిజామాబాద్‌కు మధ్యన ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్టు ఈటల తెలిపారు. అలాగే కొత్తగూడెం, వసంత్‌నగర్‌లలో ఉన్న ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అనంతరం కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వన్‌తో సమావేశమైనట్టు చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ కళాశాలలను 130 మైనారిటి కళాశాలను ప్రారంభిస్తున్నామని, ఈ పాఠశాలల్లో విద్యార్ధులకు మధ్యాహ్నా భోజన పథకం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కోటా కింద బియ్యాన్ని పెంచాలని కోరినట్టు తెలిపారు. అలాగే తెలంగాణకు పౌరసరఫరాశాఖ నుంచి రావాల్సిన రూ. 3,664 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. జీఎస్టీలోని వివిధ శ్లాబుల్లో వస్తువులు చేర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ తదుపరి సమావేశం మే 18,19 తేదీల్లో జమ్మూలో జరగనున్నట్టు ఆయన తెలిపారు.