జాతీయ వార్తలు

వాదించండి...ఘర్షణ పడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 1: విద్యార్థులు తర్కబద్ధంగా చర్చల్లో పాల్గొనాలని, వాదోపవాదాలు చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులు ఎప్పుడూ అసహనపరులు కావొద్దని ఆయన హితవు పలికారు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరయిన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో స్వేచ్ఛాయుత చర్చల వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదం చేశారని, ఘర్షణ వాతావరణాన్ని కాదని అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఐఐఎం కలకత్తా 52వ స్నాతకోత్సవంలో రాష్టప్రతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమర్త్య సేన్ చెప్పినట్లు భారతీయుడు తార్కికవాది కాగలడు కాని, అసహనపరుడు కాదు’ అని ఆయన అన్నారు. ‘్భరత్ సహనం గల నేల. బుద్ధుడు, చైతన్యుడు పుట్టిన గడ్డ. కాని, అసహనానికి నిలయం కాదు’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘నేను ఇలా చెప్పటం ద్వారా ఎవరి మనోభావాలనైనా గాయపరచి ఉంటే, దయచేసి క్షమించండి’ అని కూడా ఆయన అన్నారు. ‘విశ్వవిద్యాలయాలలో వందలాది ఆలోచనలను వికసించనివ్వండి. చర్చోపచర్చలు జరగనివ్వండి. కాని, ఘర్షణలకు తావివ్వకండి’ అని ఆయన అన్నారు.