జాతీయ వార్తలు

కరుణది కుటుంబపాలన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 28: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై అన్నా డి ఎంకే చీఫ్ జయలలిత తీవ్ర విమర్శలు చేశారు. తమ పోరాటం తమిళనాడును కబళించి తమ కుటుంబపాలన చేయాలని చూస్తున్న డీఎంకే నుంచి కాపాడాలన్నదేనని జయ అన్నారు. తమ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, పేదలు, సామాన్య ప్రజలతో అధికారాన్ని పంచుకుంటామని జయలలిత పేర్కొన్నారు. ‘కుటుంబ పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఒక కుటుంబంలోనే అధికారం, రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉండటం అనేవి అందరికీ సమాన అవకాశాలు అన్న వౌలిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఉచిత మిక్సర్లు, గ్రైండర్లు, అమ్మ క్యాంటిన్‌లు, 20కిలోల ఉచిత బియ్యం, అమ్మ మందులు వంటి పథకాలను కొనసాగాలంటే తనకు మద్దతు ఇవ్వాలని జయలలిత కోరారు.