జాతీయ వార్తలు

ఏ ఓటేసినా.. పడింది బిజెపికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మధ్యప్రదేశ్‌లోని ఉప ఎన్నిక జరుగనున్న భింద్‌లో ఎన్నికల అధికారులు వివిపిఎటి పనితీరును వివరించేందుకు నిర్వహించిన ప్రదర్శనలో ఏ పార్టీ ఎన్నికల చిహ్నం ఉన్న బటన్ నొక్కినప్పటికీ బిజెపి చిహ్నం ఉన్న చీటి మాత్రమే బయటకు వచ్చిందని మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మీడియా వార్తలపై సమగ్రమైన నివేదికను పంపించ వలసిందిగా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక రాగానే స్పందిస్తామని ఎన్నికల సంఘానికి చెందిన ఒక అధికార ప్రతినిధి శనివారం ఇక్కడ చెప్పారు. ఓటరు తాను వేసిన ఓటు సరిగా పడిందో, లేదో అనే విషయాన్ని వివిపిఎటి (వోటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్) మిషన్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఓటు వేసిన ఏడు సెకన్లలో ఈ మిషన్ ఒక చీటీని విడుదల చేస్తుంది. ఆ చీటీలో సదరు వ్యక్తి ఓటు ఎవరికి పడిందో తెలుస్తుంది. ఈ చీటి ఓటరుకు రశీదులాంటిదన్న మాట. పోలింగ్ కేంద్రంలోనే దాన్ని చూసుకోవాలి కాని, ఇంటికి తీసుకెళ్లడానికి వీలులేదు. అయితే ఏ పార్టీ చిహ్నానికి ఓటు వేసినా అది బిజెపి చిహ్నానికి ఓటు పడినట్లుగా వివిపిఎటి మిషన్ నుంచి చీటీలు వచ్చాయని మీడియాలో వార్తలు వచ్చాయి. బిజెపి చిహ్నానికి మాత్రమే ఓట్లు పడినట్లు చీటీలు వచ్చాయన్న వార్తలు ఏ పత్రికల్లోనూ కనపడొద్దని మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సలీనా సింగ్ హెచ్చరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. వార్తలు రాస్తే పోలీసు స్టేషన్‌లో నిర్బంధిస్తామని కూడా సిఇఒ హెచ్చరించినట్లు ఈ కథనాలలో పేర్కొన్నారు.

చిత్రం..శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి సలీనాసింగ్