జాతీయ వార్తలు

దేశ నిర్మాణంలో తెలుగువారి పాత్ర గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలుగునేల ఎందరో ప్రముఖులను అందించిందని, భారతదేశ నిర్మాణంలో తెలుగువారి పాత్ర చాలా గొప్పదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. ఆదివారం ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో పిజే కురియన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డిని ‘సాంస్కృతిక సార్వభౌమ’ బిరుదుతో సత్కరించారు. ఈ మేరకు కురియన్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలుగు వారు సత్తాచాటుతున్నారని వెల్లడించారు. తెలుగు వ్యక్తి మాజీ ప్రధాని పి.వి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరవలేమని తెలిపారు. పి.వి మంత్రి వర్గంలో పని చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన సుబ్బిరామి రెడ్డి తెలుగువారికే కాకుండా దేశానికి గర్వకారణమని పొగిడారు. అనంతరం సినీ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కురియన్ గొప్పపాత్ర పోషిస్తున్నారని, సభను సజావుగా నడపడానికి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎంపీ సుబ్బిరామిరెడ్డి సహాయంతోనే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను స్థాపించానని తెలిపారు. సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ తాను సమాజంకోసం ఆలోచిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందన్నారు. కళాకారులకు, ప్రముఖులకు అవార్డులతో సత్కరించే తాను మొదటిసారిగా పురస్కారాన్ని అందుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్ నారాయణ, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.