జాతీయ వార్తలు

కరవు సహాయక ప్యాకేజీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కరవుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ఆదుకోవాలంటూ తమిళనాడుకు చెందిన రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 20 రోజులకు చేరుకున్నాయి. కరవునిధి, రుణమాఫీతో పాటు ఇతర డిమాండ్‌లతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు ఆదివారం శిరోమండనం చేయించుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పంటలు పండక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సమాధుల నుంచి తీసుకొచ్చిన పుర్రెలను పట్టుకుని ఢిల్లీలో జరిగిన నిరసనలో పాల్గొనడం ద్వారా దేశంలో అందర్నీ ఆకర్షించారు. గత 20 రోజులుగా ప్రతిరోజు ఢిల్లీలో ఎదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రూ.20 వేల కోట్లకు పైగా తమిళనాడు రైతులకు నష్టం వాటిల్లింది. కేంద్రం వెంటనే కరవు సహాయక ప్యాకేజీ ప్రకటించాలని, మద్దతు ధర కల్పించాలని తంజావూర్‌కు చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమిళ రైతులు చేస్తున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడులో ప్రతిపక్ష నేత డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్, తమిళనాడుకు చెందిన సినీ ప్రముఖులు, వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.