జాతీయ వార్తలు

భారతీయ సంస్కృతికి దూతను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఏప్రిల్ 2: భారత ప్రభుత్వానికి తాను సుదీర్ఘకాలంగా అతిథిగా ఉన్నానని, ఇప్పుడు భారతీయ సంస్కృతికి ఒక దూతగా తాను రుణాన్ని తీర్చుకుంటున్నానని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. నేను గత 58 ఏళ్లుగా భారత ప్రభుత్వ అతిథిగా ఉంటున్నాను అని ఆదివారం నాడిక్కడ ‘ఆధునిక కాలంలో ప్రాచీన భారత సంస్కృతి’ అనే అంశంపై ప్రసంగిస్తూ దలైలామా అన్నారు. ‘కొనే్నళ్లుగా నేను భరతమాత బిడ్డగా అభివర్ణించుకుంటున్నాను. కొనే్నళ్ల క్రితం చైనా మీడియాకు చెందిన కొందరు వచ్చి మీరు అలా ఎందుకు చేస్తున్నారని అడిగారు. నా మెదడులో ప్రతిభాగం కూడా నలంద ఆలోచనలతో నిండి ఉందని నేను వారికి చెప్పాను. భౌతికంగా కూడా గత యాభైఏళ్లుగా నా శరీరం కూడా భారతీయ పప్పు, చపాతితో మనుగడ సాగిస్తోంది. అందువల్ల భౌతికంగా, మానసికంగా కూడా నేను ఒక భారతీయుడినే’ అని దలైలామా చెప్పారు. లౌకికవాదం గురించి మాట్లాడుతూ ‘మతసామరస్యాన్ని ప్రచారం చేయడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అల్లర్లు సృష్టించే కొంతమంది ఆకతాయిలు ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. విభేదాలను, సమస్యలను తగ్గించుకోవడానికి ఉన్న ఏకైకమార్గం మనమంతా కూడా మానవమాత్రులమేనని భావించడమే’నని అన్నాను.
ఇదే కార్యక్రమంలో తన ఆత్మకథ ‘మైలాండ్ అండ్ మై పీపుల్’ అస్సామీ తర్జుమాను ఆయన విడుదల చేస్తూ, హింసకు తావులేని శాంతియుత ప్రపంచం పట్ల ఆశావహంగా ఉన్నానని చెప్పారు. ‘నా జీవిత కాలంలో పెద్దమార్పును చూస్తానో లేదో చెప్పలేను. అయితే నేను ఆశాజీవిని. విద్యద్వారా రాబోయే తరంవారు తమ తప్పును తెలుసుకొని కరుణ, ప్రేమలను తీసుకు రావచ్చు. మానవాళి భవిష్యత్తు మానవాళిపైనే ఆధారపడి ఉంది తప్ప దేవుడిపై కాదు’ అని దలైలామా అన్నారు. ఇప్పుడు గనుక మహమ్మదు ప్రవక్త, గౌతమ బుద్ధుడు, మహావీరుడు మళ్లీ కనిపిస్తే, హింసను ఎవరు సృష్టించారు? అని వాళ్లు ప్రశ్నించవచ్చు. హింసను సృష్టించింది దేవుడు కాదు, మీరే. అందువల్ల దాన్ని అంతం చేసే బాధ్యత కూడా మీదే అని కూడా అంటారు’ అని అన్నారు.
దేశంలో కులవ్యవస్థ తీరును దలైమా విమర్శిస్తూ, భారతీయ కులవ్యవస్థలో అన్యాయానికి గురవుతున్నది తక్కువ కులం వాళ్లే. అందుకే వాళ్లు తాము తక్కువ వాళ్లమని వారు అనుకుంటున్నారు. మనం దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు.

చిత్రం..గౌహతిలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన ఆత్మకథ ‘మైలాండ్ అండ్ మై పీపుల్’ అస్సామీ తర్జుమా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దలైలామా