జాతీయ వార్తలు

వీరభద్రసింగ్‌పై ఈడి కొరడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీలాండరింగ్ కేసులో సింగ్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ను ఈడి అటాచ్ చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్‌రౌలీ ప్రాంతంలోని వీరభద్ర సింగ్ ఫామ్‌హౌస్‌ను అటాచ్ చేసుకుంటూ సోమవారం ఆదేశాలిచ్చింది. మాప్లే డిస్టినేషన్ అండ్ డ్రీమ్ బిల్డింగ్ పేరుతో ఉన్న ఫామ్‌హౌస్ మార్కెట్ విలువ 27 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్రమార్జన కేసులో వీరభద్ర సింగ్‌పై ఇప్పటికే సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా ఈడి అటాచ్‌మెంట్ సంచలనం రేపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్, ఆయన భార్య, కుటుంబ సభ్యులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సుమారు 10 కోట్ల రూపాయలు అక్రమ సంపద కలిగి ఉన్నట్టు విచారణలో తేలింది. 2015నాటి సిబిఐ చార్జిషీటు ఆధారంగా 82 ఏళ్ల వీరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా వీరభద్రసింగ్‌పై కేసులు రాజకీయ కక్ష సాధింపేనని, వీటిపై పెద్దగా భయపడాల్సింది లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఇటీవల వ్యాఖ్యానించారు. న్యాయపోరాటంలో తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క హిమాచల్‌ప్రదేశ్‌ను అవినీతికి కేరాఫ్‌గా మార్చిన వీరభద్ర సింగ్ రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.